తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. ప్రేమ లేఖ‌లు, గిఫ్టులు స్వాధీనం

-

తిరుపతి లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య సంఘటన కలకలం రేపుతోంది. తిరుపతి లోని పద్మావతి జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పద్మావతి జూనియర్ కళాశాల రెండవ అంతస్తులోని రూమ్ నెంబర్ 203 లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం గర్నిమిట్ట కు చెందిన విష్ణు ప్రియ(17) గా పోలీసులు గుర్తించారు.

కువైట్ లో కూలి పనులకు వెళ్లిన సరస్వతి, గోవిందు దంపతుల కు ముగ్గురు సంతానం కాగా.. రెండవ కుమార్తెనే విష్ణు ప్రియ. అయితే.. ఏం జరిగిందో తెలీదు కానీ విష్ణు ప్రియ.. ఊరేసుకుని సూసైడ్ చేసుకుంది.

ప్రేమ వ్యవ హారంలో కుటుంబ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారని మనస్తాపం గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతే కాదు ఆమె గదిలో ప్రేమ లేఖ‌లు, గిఫ్టులు ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక విష్ణు ప్రియ మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. విష్ణు ప్రియ ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని యూనివర్సిటీ ఎస్ ఐ కె అనిత వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version