భార్య ఉండగానే మరదలితో బావ రాసలీలలు..చివరికి !

-

తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండా లో విషాదం చోటుచేసుకుంది. గుగులోతు శ్రీను చిన్ని దంపతులు వారికి ఐదుగురు కుమార్తెలు, కొన్నేళ్ళ క్రితం శ్రీను కన్ను మూశాడు దీంతో తాను పైసా పైసా కూడబెట్టి నలుగురు కుమార్తెలకు చిన్ని వివాహం చేసింది.ఆమె చివరి కుమార్తె ప్రమీల (22)ఖమ్మం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుంది.చదువు అనంతరం విజయవాడకు చెందిన ఓ యువకుడితో ఎంగేజ్మెంట్ కూడా చేసింది.

 

 

ఏప్రిల్ 10న వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ తరుణం లో మరదలిపై ఎప్పటినుండో కన్నేసిన చిన్ని మూడో అల్లుడు సంతోష్ మరదలిని వేధింపులకి గురి చేసాడు. ఇవి తట్టుకోలేక ఇటీవల చిన్ని తన కూతురితో కలిసి మరో కుమార్తె ఇంటికి వెళ్ళిపోయింది.అప్పటి నుండి వారిని సంతోష్ మరింత వేధించాడు. ఇవన్నీ భరించలేక మార్చి 22న పురుగుల మందు తాగింది. ఆమెను హుటాహుటిన ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది.అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మృతిపై ఆమె తల్లి చిన్ని గుండెలు బాదుకుని విలపించింది. చివరికి అక్క భర్తే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు.ఈ విషయం పై ఎస్ఐ సాయికుమార్ కేసు రాసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version