ట్రాన్స్ జెండర్ల వేషంతో బెదిరింపులు.. అరెస్ట్..!

-

హైదరాబాద్ నగరంలో ట్రాన్స్ జెండర్ల వేషం వేసుకొని పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు.  ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాన్స్ జెండర్ల వేషం లో వచ్చి డబ్బులను వసూలు చేస్తున్నారు. సిగ్నల్ వద్ద వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ట్రాన్స్ జెండర్లు  అరెస్ట్ అయ్యారు. మగవాళ్లే ట్రాన్స్ జెండర్ల గా వేషం వేసుకొని వసూలు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు. బీహార్  నగరం నుంచి వచ్చిన కొంతమంది ముఠాగా ఏర్పడి ట్రాన్స్ జెండర్ల వేషాట్లో బెగ్గింగ్ చేస్తున్నారు.

ముఖ్యంగా  సికింద్రాబాద్,ప్యారడైజ్,జూబ్లీబస్ స్టేషన్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్ల వేషాలతో  ఎక్కువగా వీరు డబ్బులు వసూళ్లు చేస్తుంటారు. ఇందులో 15మందిని టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బెగ్గింగ్ ముఠాకు చెందిన మరో ఐదుగురు నిర్వాహకులను కూడా  అరెస్ట్ చేశారు. అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. బెగ్గింగ్ మాఫియా ఇప్పటి వరకు 20 మందిని రెస్క్యూ చేశాం. ప్రజలు ఇబ్బందికి గురైతే డయల్ 100కు కాల్ చేయండి అని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version