హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలోని బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 9 మంది మరణించారు. ఇందులో ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో 4 రోజుల పసికందు కూడా మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. పుట్టిన నాలుగు రోజులకే పసికందు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేస్తామని కూడా, నిందితులను వదిలిపెట్టబోమని వివరించారు మంత్రి కేటీఆర్.