బీహార్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. హైవే పక్కన ఉన్న పొదల్లో యువతి అర్ధ నగ్న శవం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, బీహార్, బోజ్పూర్ జిల్లాలోని బారుశి-విష్ణుపురా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఉదయం పూట దగ్గరలో ఉన్న హైవేపై నడుచుకుంటూ వెళుతున్నారు.
ఈ నేపథ్యంలో హైవే పక్కన ఉన్న పొదల్లో ఎవరో మనిషి పడుకోని ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఎవరా అని పొదల దగ్గరకు వెళ్లారు. అక్కడికి పోయిన తర్వాత అసలు విషయం తెలిసింది. అది యువతి శవం అని తెలియగానే షాక్ కు గురయ్యారు.
పై గా యువతి శవం అర్థనగ్నంగా ఉండటంతో మరింత భయానికి గురయ్యారు. వెంటనే పోలీ సులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందు కున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాని కి చేరుకున్నారు. యువతిని రేప్ చేసి, నగ్నంగా పడేసి, నిందితులు పారిపోయి ఉంటారని సమాచారం అందుతోంది.