కేవ‌లం ఒక్క క్లిక్‌తో ఫొటోల్లోని మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా చూపించే యాప్‌.. టెక్నాల‌జీతో ఎంతైనా డేంజ‌రే..!

-

డీప్‌న్యూడ్ యాప్ మ‌హిళ‌ల హ‌క్కుల‌కు భంగం క‌లిగించేవిధంగా ఉంద‌ని, వారి ప్రైవ‌సీకి అది న‌ష్టం క‌లిగిస్తుంద‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావ‌డంతో ఆ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన కంపెనీ దాన్ని మూసేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో టెక్నాల‌జీ ప‌రంగా విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్నాయి. నూత‌న టెక్నాల‌జీ వ‌ల్ల మ‌న ప‌ని మ‌రింత సుల‌భ‌త‌రం అవుతోంది. అనేక సేవ‌ల‌ను కూడా మ‌నం క్ష‌ణాల్లోనే పొంద‌గ‌లుగుతున్నాం. అయితే ఒక అంశానికి సంబంధించి లాభ‌, న‌ష్టాలు రెండూ ఉన్న‌ట్లే.. టెక్నాల‌జీ వ‌ల్ల మ‌న‌కు ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని న‌ష్టాలూ ఉన్నాయి. ముఖ్యంగా కొంద‌రు ప్ర‌బుద్ధులు టెక్నాల‌జీని మంచి ప‌నికి కాకుండా కేవ‌లం చెడ్డ ప‌నుల‌కే వినియోగిస్తున్నారు. ఇప్పుడు చెప్ప‌బోయే ఓ యాప్‌కు స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వ‌ల్ల మ‌న‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని ఓ కంపెనీ ఒక యాప్‌ను త‌యారు చేసింది. దాని పేరే.. డీప్‌న్యూడ్‌.. ఇందులో కృత్రిమ మేథ‌ను చొప్పించారు. ఈ క్ర‌మంలో ఈ యాప్‌లోకి ఏ మ‌హిళ‌కు చెందిన ఫొటోనైనా అప్‌లోడ్ చేస్తే.. ఆ ఫొటోలో ఆ మ‌హిళ ధ‌రించి ఉన్న దుస్తుల‌ను ఈ యాప్ ఆటోమేటిక్‌గా తీసేస్తుంది. దీంతో ఆ ఫొటోలో ఉన్న మ‌హిళ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిస్తుంది. ప్ర‌స్తుతం ఇదే యాప్‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

స‌ద‌రు డీప్‌న్యూడ్ యాప్ మ‌హిళ‌ల హ‌క్కుల‌కు భంగం క‌లిగించేవిధంగా ఉంద‌ని, వారి ప్రైవ‌సీకి అది న‌ష్టం క‌లిగిస్తుంద‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావ‌డంతో ఆ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన కంపెనీ దాన్ని మూసేసింది. గ‌త నెల‌లోనే ఈ యాప్‌ను లాంచ్ చేసిన‌ప్ప‌టికీ ఈ యాప్ చాలా త‌క్కువ కాలంలోనే పాపుల‌ర్ అయింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ స‌హాయంతో మ‌హిళ‌ల ఫొటోల‌ను ఉపయోగించి వారి న‌గ్న ఫొటోలు అచ్చం అచ్చు గుద్దిన‌ట్లుగా త‌యారు చేసే వీలు ఉండడంతో ఈ యాప్‌కు త‌క్కువ కాలంలోనే ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో పెద్ద ఎత్తున దీన్ని చాలా మంది వాడ‌డం మొద‌లు పెట్టారు.

ఇక ఈ డీప్‌న్యూడ్ యాప్‌లో రెండు ర‌కాల వెర్ష‌న్లు ఉంటాయి. ఉచిత వెర్ష‌న్‌లో ఫొటోల‌పై వాట‌ర్ మార్క్ వ‌స్తుంది. అదే పెయిడ్ వెర్ష‌న్ అయితే 50 డాల‌ర్లు చెల్లించాలి. ఈ క్ర‌మంలో ఈ యాప్ ప్ర‌స్తుతం వివాదాస్ప‌దం కావ‌డంతో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున కంప్లెయింట్లు వెల్లువెత్త‌డంతో ఈ యాప్‌ను తొల‌గిస్తున్నామ‌ని, ఇక‌పై దీన్ని ఎవ‌రూ వాడ‌లేర‌ని ఈ యాప్ డెవ‌ల‌ప‌ర్ కంపెనీ తెలిపింది. కేవ‌లం ఒకే ఒక్క క్లిక్‌తో మ‌హిళ‌ల‌కు చెందిన అస‌లు ఫొటోల‌ను న‌గ్న ఫొటోలుగా మార్చే వీలును ఈ యాప్ క‌ల్పిస్తుండ‌డంతో ఈ యాప్ అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంది. అస‌లు ఇలా ఎందుకు చేశారు అన్న ప్ర‌శ్న‌కు ఈ యాప్ డెవ‌ల‌ప‌ర్ వ‌ద్ద స‌మాధానం లేదు. కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోస‌మే అని ఆ కంపెనీ చెబుతున్న‌ప్ప‌టికీ దురుద్దేశంతోనే ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఏది ఏమైనా ఇలాంటి యాప్‌లు నిజంగా మ‌న స‌మ‌జానికి హానిక‌ర‌మే.. ఈ త‌ర‌హా యాప్‌లను క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. టెక్నాల‌జీ వ‌ల్ల మ‌న‌కు ఇలాంటి కీడు కూడా జ‌రుగుతుంద‌ని చెప్ప‌డానికి ఈ యాపే ఒక ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని చెప్ప‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news