అత్త,మామల శృంగార వీడియోలు లీక్‌ చేసిన కోడలు !

దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన గోల్డ్ వ్యాపారి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే తన భార్య కాలేజీ ఫ్రెండ్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని, వీరి మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ మెసేజ్ వల్ల అది నిజం అని తేలింది. అనంతరం ఆ వ్యాపారస్తుడు భార్య స్నేహితుడికి ఫోన్ చేసి వెంటనే తనను కలవాలంటూ కోరాడు.

అది తెలుసుకున్న భార్య ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు తీసుకుని ప్రియుడుతో కలిసి పారిపోయింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ భార్య అనంతరం భర్తకు ఫోన్ చేసి, తన అత్తమామల గదిలో కెమెరాలు అమర్చి నగ్న వీడియోలు రికార్డు చేసినట్టు తెలిపింది. కేసు వాపసు తీసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించింది. ఆ తర్వాత పోలీసులు వారి ఇంటిని తనిఖీలు చేయగా, విషయం తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం