రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులతో స‌హా ముగ్గురు మృతి

రంగ‌రెడ్డి జిల్లా గచ్చిబౌలి లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు మృతి చెందారు. అలాగే కారు డైవ‌ర్ కూడా మర‌ణించాడు. అలాగే మ‌రో జూనియ‌ర్ ఆర్టిస్టుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ రోజు తెల్ల‌వారు జామున 3 :30 గంట‌ల‌కు కార్ లో జూనియ‌ర్ ఆర్టీస్టులు మాన‌స (22), మాన‌స (21), సిద్దు ఒక కారులో గ‌చ్చిబౌలి వైపు వ‌స్తున్నారు. అయితే కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్ కు మ‌ధ్య లో ఉండే చెట్టు కు ఢీ కొట్టింది.

దీంతో మాన‌స‌, మాన‌స, కారు డ్రైవ‌ర్ అబ్దుల్లా అక్క‌డి కక్క‌డే మృతి చెందారు. కారులో ఉన్న‌ మ‌రో జూనియ‌ర్ ఆర్టిస్ట్ సిద్దు కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్ర‌మాద స్థలానికి పోలీసులు చేరుకుని సిద్ధును ఆస్ప‌త్రికి త‌రలించారు. అలాగే ప్ర‌మాదం పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగ చ‌నిపోయిన ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు హైద‌రాబాద్ లోని అమీర్ పేట్ లో ఒక హాస్ట‌ల్ లో ఉంటున్నార‌ని తెలిసింది.