RRR : ఆర్ఆర్ఆర్ పోస్టర్ పై ట్రాఫిక్‌ పోలీసులు పంచ్‌

-

బాహుబలి వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, చ‌రణ్ ప్రధాన పాత్రల‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ని… పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. అయితే.. ఈ మూవీ నుంచి ఇవాళ ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ ను విడుదల చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.

ఈ పోస్టర్‌ లో యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం భీమ్ గా బైక్ నడుపుతుంటే… ఆ వెనకే చిరునవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్. అంతా బాగానే ఉంది. కానీ.. ఈ పోస్టర్‌పై సైబరాబాద్‌ పోలీసులు ఓ పంచ్‌ వేశారు. ఎన్టీఆర్‌, రాంచరణ్‌కు హెల్మెట్‌ లేదని.. హెల్మెట్‌ పెట్టి మరీ మరో పోస్టర్‌ రిలీజ్ చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. ”ఇప్పుడు సరిగ్గా ఉంది.. హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ఉండండి” అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టారు పోలీసులు. పోలీసులు తాజాగా రిలీజ్‌ చేసిన లేటెస్ట్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version