‘ఫ్యాన్’ కోటల్లో సైకిల్ స్పీడ్..ఈ సారి ఛాన్స్ ఉందా?

-

ఏపీలో అధికార వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది..ఆ నియోజకవర్గాల్లో వైసీపీ విజయాన్ని ఆపడం చాలా కష్టమని చెప్పొచ్చు. అలా వైసీపీ విజయాలకు కేరాఫ్ అడ్రెస్ గా అనేక నియోజకవర్గాలు ఉన్నాయి…అలా వైసీపీకి కంచుకోటలుగా ఉన్న వాటిల్లో బాపట్ల, మాచర్ల, నరసారావుపేట, గుంటూరు ఈస్ట్, మంగళగిరి స్థానాలు ఉన్నాయి…ఈ ఐదు స్థానాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి.

2014, 2019 ఎన్నికల్లో ఈ ఐదు చోట్ల వైసీపీ గెలుస్తూనే వచ్చింది. మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఐదు చోట్ల వైసీపీ గెలుస్తుందా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది..ఎందుకంటే గుంటూరులో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. రాజధాని అంశం కావొచ్చు…ప్రతిపక్ష టీడీపీ పుంజుకోవడం కావొచ్చు..అలాగే వైసీపీపై వ్యతిరేకత పెరగడం లాంటి అంశాలు..ఆ ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్తితి ఇబ్బందికరంగా మారింది.

ముఖ్యంగా రాజధాని అమరావతి అంశం…మంగళగిరిపై బాగా ఉంది…పైగా ఇక్కడ నారా లోకేష్ పోటీకి దిగుతున్నారు…ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు. అలాగే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు. అటు గుంటూరు ఈస్ట్ లో ఎమ్మెల్యే ముస్తఫా పనితీరు కూడా మెరుగ్గా కనిపించడం లేదు. పైగా టీడీపీతో గాని జనసేన కలిస్తే…గుంటూరు ఈస్ట్ లో వైసీపీ గెలుపు గగనమయ్యేలా ఉంది.

అటు బాపట్లలో కూడా ఈ సారి వైసీపీ పరిస్తితి మెరుగ్గా కనిపించడం లేదు..ఇక్కడ టీడీపీ పుంజుకుంది. ఇక మాచర్ల, నరసారావుపేట వైసీపీ ఎమ్మెల్యేలు కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా బలంగానే ఉన్నారు..కానీ ఈ నియోజకవర్గాల్లో టీడీపీ కూడా బలపడుతుంది. కాబట్టి ఈ సారి టీడీపీని తేలికగా తీసుకోకూడదు. మొత్తానికి వైసీపీకి కంచుకోటలుగా ఉన్న ఈ ఐదు స్థానాల్లో ఈ సారి టీడీపీకి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news