ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావుకు గుండెపోటు.. చంద్రబాబు పరామర్శ

-

కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కు మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ను వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. దగ్గుబాటికి తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు.

ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అయితే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు.

మంగళవారం రాత్రి ఏడు గంటలకు అపోలో ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు నాయుడు… దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు దగ్గుబాటికి తోడల్లుడు అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news