గోదావరిలో కొట్టుకొచ్చిన జింక.. కాపాడిన స్థానికులు

-

మన దేశం అంతటా వర్షాలు ఎంత భారీగా కురుస్తున్నాయి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వర్షాలు వరదలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తో్ంది. ఈ భారీ వర్షాల కారణంగ గోదావరి నదిలో ఓక జింక కొట్టుకు వచ్చింది. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు చాలా భారీగా విరుచుకుపడుతున్నాయి. ఇటు ములుగు జిల్లాలో కూడా బీభత్సమైన వర్షాలు జోరుగానే కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో గోదారి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద నీటిలో వాజేడు గ్రామ శివారుకు జింక కొట్టుకొచ్చింది. కుక్కలు ఆ జింకను వెంబడిస్తుండగా..దీన్ని గమనించిన స్థానికులు ఆ జింకని కాపాడారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అక్కడి స్థానికులు. వాజేడు గ్రామానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ జింకకు ప్రథమ చికిత్స చేసి …జూపార్కుకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version