ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి కల్పించే ఢిల్లీ సర్వీసెస్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించి లోక్ సభ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఉదయం సభలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై వాడివేడీగా చర్చ జరిగింది. బిల్లు ఆమోదం సందర్భంగా ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో మూజువాణి ఓటింగ్ తో బిల్లుకు ఆమోదం తెలిపింది లోక్ సభ.ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ స్పీకర్ పై బిల్లు కాగితాలు విసిరినందుకు లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.
అనంతరం లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. రేపు(ఆగస్టు 4) రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.విపక్షాలు కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలన్నారు కేంద్రహోంమంత్రి అ మిత్ షా. లోక్‌సభలో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లుపై బిల్లుపై లోక్ సభలో హాట్ హాట్ చర్చ జరిగింది. ఢిల్లీ కోసం చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు ఉందన్నారు అమిత్ షా. ఎవరి అధికారాలను గుంజుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు.