తెలంగాణ ఉద్యమ నాయకుడు దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లోని బిర్యానిపై నిషేధం విధిస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు దేశపతి శ్రీనివాస్. దేశంను హిట్లర్ వారసులు పాలిస్తున్నారని ఫైర్ అయ్యారు.
దేశంలో ఏమి జరుగుతుందో చెప్పే పాటలు రావాల్సిన అవసరం ఉందన్నారు.ఒక ఆయన హైదరాబాద్ పేరు భాగ్య నగర్ అని మారుస్తా అంటున్నారు…మరి బిర్యానీ కూడా నిషేదిస్తరా ? అని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరం ఏకంగా కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ దూసుకుపోతుందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు దేశపతి శ్రీనివాస్.