కేటీఆర్ ఓ “యూజ్ లెస్ ఫెలో”.. మగాడు అయితే ఆ పని చేయాలి : ధర్మపురి అరవింద్

-

ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం‌ కేసీఆర్, కేటీఆర్ లపై అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం సీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చారు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో‌ తమతో పోరాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు బానిసత్వం చేయటం కంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి చావటం మేలు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సెక్యూరిటీని పక్క‌మ పెడితే లిబియాలో గడాఫీకి పట్టిన గతే కేసీఆర్ కు పడ్తోందని.. వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై లైవ్ డిబేట్ కు రెడీ అన్నారు. నిరంజన్ రెడ్డి ఇంటికి రావటానికీ సిద్ధమేనని స్పష్టం చేశారు. వరి విత్తనాలు బదులు.. గంజాయి విత్తనాలు అమ్మాలా? కేసీఆర్ కు కాళ్ళు మెక్కినందుకే సిద్దిపేట కలెక్టర్ డ్యూటీలో ఉన్నాడని ఫైర్ చురకలు అంటించారు.

యూస్ లెస్ ఫెలో కేటీఆర్ వల్ల.. బాలీవుడ్ ఇండస్ట్రీకి, బిల్డర్స్ తప్ప రాష్ట్రానికి ఉపయోగం లేదని నిప్పులు చెరిగారు. పండించిన ప్రతి గింజను కొంటానన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడడు? తెలంగాణ బ్రాండ్ తో బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తామన్న కేసీఆర్ ఎక్కడ ? అని నిలదీశారు. గంగుల కొంటానంటే.. హరీష్, జగదీష్ రెడ్డిలు కొనమంటున్నారు. ఎవరి మాటలు నమ్మాలని ప్రశ్నించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 20శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని.. బాయిల్డ్ రైస్ కు కేంద్రం బోనస్ ఇస్తోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version