“లవ్ చేయండి అని చెప్పడం సులువు
గెలిచి రావాలి అని చెప్పడం ఇంకా సులువు
గెలుపు ఓటములకు అతీతం అయిన ప్రేమలో
సుస్పష్ట రీతి ఒకటి దేహం అందుకోవాలి
నగ్న దేహ కాంతుల్లో కొత్త లోకం ఆవిష్కృతం కావాలి “
ప్రేమిస్తే ఏమౌతుంది.. ఏం కాదు.. కొన్ని భావోద్వేగాలు దాటుకుని వెళ్తే,చెప్పే ప్రేమ నిజంగానే మధురంగా ఉంటుంది.శృంగార సంబంధ భావనలు,దేహ సంబంధ చర్యల కోసమే ప్రేమ అన్నది నిర్థిష్టం అయి ఉంటే విఫలం అన్నది తప్పక ఉంటుంది. నిర్థిష్ట రీతిన ప్రేమ నిర్ణయాత్మకం కావాలంటే స్పష్టాతి స్పష్టం అయిన రీతిలో ప్రేమ సఫలీకృతం కావాలంటే అందుకు నిజాయితీ ఒక్కటే కారణం కావాలి. అయి ఉంటుంది కూడా!
అనంతం అయిన ప్రేమలు ఉన్నాయి.అనంతం అయిన భావనలు ఉన్నాయి.భావోద్వేగ పరంపరలో ఒకరినొకరు..అర్థం చేసుకుంటే తరువాత ఒకరికొకరు అన్నది సుస్పష్టం అవుతోంది. ప్రేమ భారం అయింది అని ఎవ్వరికి అనిపించినా వెంటేనే ఆ బంధం నుంచి తప్పుకోవడం మేలు. ప్రేమ కన్నీళ్లకు కారణం అయింది అని అనుకుంటే ఆ ప్రేమ నిజంగానే ఓ నిజాయితీ నుంచి మరో ఉద్వేగం నుంచి పుట్టింది అని తప్పక గుర్తించాలి. ప్రేమ కన్నీళ్లను జయించేందుకు కావాల్సిన శక్తిని ఇస్తే..దేహ సంబంధ చర్యలు అన్నీ సఫలీకృతం అయి ఉంటాయి. నగ్నదేహాలపై ప్రేమ రాసుకున్న లిపి తప్పక జయిస్తుంది.
– రత్నకిశోర్ శంభుమహంతి