ద‌ళితులు గెలిచారా? ఆహా ! నిజం చెప్పు అనంత బాబు !  

-

అరెస్టులు ఏమ‌యినా మంచే చేస్తాయి అని అనుకోవ‌డం అవివేకం. ద‌శాబ్దాలుగా ద‌ళితులు ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.  ఎన్నో సార్లు ఊచ‌కోత‌కు గుర‌యిన సంద‌ర్భాలు ప‌విత్ర భార‌తావ‌నిలో ఉన్నాయి. మంచో చెడో ఒక్క మేరుగ నాగార్జున మాత్ర‌మే నేరుగా స్పందించి, డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంది హ‌త్యే అని తేల్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా అదే మాట చెప్పింది. టీడీపీకి చెందిన కొంద‌రు రెడ్డి కులస్తులు కూడా హ‌త్యోదంతంపై మాట్లాడారు. వాళ్లంతా పోలీసు నిర్బంధంలో ఉండిపోయినా మాట్లాడారు. మ‌రి! గతంలో టీడీపీలో ఇలాంటివి లేవా ఉన్నాయి. ఆధిప‌త్య ధోర‌ణుల్లో భాగంగా పార్టీలలో అన్యాయం అయిపోయేది బ‌డుగులే ! అయితే వాటి స్థాయి తీవ్ర‌త అన్న‌వి ఎప్ప‌టిక‌ప్పుడు వెలుగులోకి రావు.

రానివ్వ‌రు కూడా! ఆ విధంగా వైసీపీలో కానీ, టీడీపీలో కానీ అగ్ర‌కుల ఆధిప‌త్యం నుంచి లేదా సంబంధిత ప‌త‌నం నుంచి ఏమ‌యినా కొత్త పాఠాలు మిగిలిన నాయ‌కులు నేర్చుకుంటున్నారా? కనుక ద‌ళితుల క‌న్నీరుకు అడ్డు క‌ట్ట లేదు. వాళ్ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేదు అని గ‌గ్గో లు పెడుతున్నారు సంబంధిత సంఘాల నాయ‌కులు. అరెస్టుతో న్యాయం జ‌రిగింద‌ని అనుకోలేం కానీ ఓ ఉప‌శ‌మ‌నం.. ఇది.

తీవ్ర నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య నిన్న‌టి వేళ ఎమ్మెల్సీ అనంత‌బాబు అరెస్టు అయ్యారు. ఆయ‌న పూర్తి పేరు అనంత ఉద‌య భాస్క‌ర్. గ‌తంలో కూడా ఆయ‌న వివాదాస్పదుడే ! ఓ మ‌నిషిని అతి కితాత‌కంగా చంపిన వైనం ఒక‌టి వెలుగు చూశాక ఆయ‌న వికృతం ఏంట‌న్న‌ది తెలిశాక ఇప్పుడంతా ఆయ‌నపై కోపం అవ్వ‌డం, తిట్ట‌డం వంటివి చేస్తున్నారు. కానీ ఆయ‌న త‌క్కువేం కాడు.

గ‌తంలో కూడా ఇలానే రెచ్చిపోయాడు. చంద్ర‌బాబు హ‌యాంలోనూ రెచ్చిపోయాడు. అప్పుడు కూడా ఆగ‌డాల‌కు అంతే లేదు. గిరిజ‌న గూడ‌ల్లో ఆయ‌న మాటే శాస‌నం. గంజాయి సాగు, ర‌వాణాలో ఆరితేరిన నైజం ఉన్న నాయ‌కుడు అత‌డే అని ఇప్ప‌టి వార్త. కానీ ఎప్ప‌టి నుంచో ఆయ‌న రంగు రాళ్ల వ్యాపారం కూడా చేస్తున్నాడు. రంప‌చోడ‌వ‌రం ప‌రిస‌రాల్లో చాలా చెడ్డ ప‌నులే చేస్తున్నాడు . ఆ చెడుకు విరుగుడు ఇప్ప‌టిదాకా లేదు. ఇక‌పై వ‌స్తుందా అంటే చెప్ప‌లేం. ఆయ‌న‌ది కాపు సామాజిక‌వ‌ర్గం. క‌నుక బొత్స మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయ‌న‌కు మద్ద‌తిస్తూ.. కొన్ని విష‌యాలేవో చెప్పారు. అవ‌న్నీ వైర‌ల్ అయ్యాయి. కానీ అనంత‌బాబు త‌ప్పుడు కుల ధ్రువీక‌ర‌ణ (కొండ‌కాపు అంటే ఎస్టీ)తో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ప‌రిత‌పించి భంగ‌ప‌డ్డాడు. ఇలాంటివి ఒక‌టి కాదు రెండు కాదు ఎన్నో ! మ‌రి! అరెస్టుతో ద‌ళితుల‌కు న్యాయం జ‌రిగిందా?

Read more RELATED
Recommended to you

Exit mobile version