కంటికి కూడా స్ట్రోక్‌ వస్తుంది తెలుసా..? ఇది మరీ డేంజర్‌

-

బ్రెయిన్‌ స్ట్రోక్‌, హార్ట్‌ స్ట్రోక్స్‌ గురించి మనకు తెలుసు.. ఇవి ఎంత డేంజరో కూడా మనం వినే ఉంటాం. స్ట్రోక్స్‌ అంటే మెదడు, గుండెకే కాదు.. కంటికి కూడా వస్తాయని మీకు తెలుసా..? కంటి స్ట్రోక్‌ కూడా ఉంటుందట. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. కంటి స్ట్రోక్ వస్తే చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. కంటి స్ట్రోక్‌ను కంటి పక్షవాతం లాంటిదే.. ఇది కంటిలోని ఆప్టిక్ నరాలలోకి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల వచ్చే ఒక సమస్య. దీని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

ఈ కంటి స్ట్రోక్ వస్తే ఆకస్మికంగా కంటి చూపు పోతుంది. అంతవరకు కనిపించిన కళ్ళు అకస్మాత్తుగా బ్లాంక్‌ అయిపోతాయి. ఏం జరిగిందో తెలియక భయంతో ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందట.. కంటి స్ట్రోక్ వచ్చే ముందు చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. కానీ అవగాహన తక్కువ కాబట్టి చాలా మందికి దీని గురించి తెలిసే ఛాన్స్‌ ఉండదు..

కంటి స్ట్రోక్‌ లక్షణాలు..

కళ్ళలోని చిన్న రక్తనాళాలు దెబ్బ తినడం ద్వారా మొదటి లక్షణం కనిపిస్తుంది.
అస్పష్టంగా కనిపించడం, చూపులో చీకటి ప్రాంతాలు లేదా నీడ లాంటివి కనిపించడం జరుగుతుంది.
వైద్యులు చెబుతున్న ప్రకారం.. రెండు కళ్ళకు కంటి స్ట్రోక్ ఒకేసారి వచ్చే అవకాశం తక్కువే, ఒక కంటికి మొదట కంటి స్ట్రోక్ వస్తుంది. అప్పుడు వెంటనే చికిత్స తీసుకుంటే రెండో కంటికి రాకుండా చూసుకోవచ్చు. రెండు కళ్ళకు ఒకేసారి కంటి స్ట్రోకు వస్తే మాత్రం శాశ్వతంగా చూపు కోల్పోతారు.

అసలు ఇది ఎందుకు వస్తుంది?

కంటిలోని రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగా లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆప్టిక్ నాడి అనేది మెదడును, కంటిని అనుసంధానించే ఒక నరం. దీనిలో మిలియన్ల కొద్ది నరాల ఫైబర్లు ఉంటాయి. ఈ ఆప్టిక్ నాడి దెబ్బతింటే కంటి స్ట్రోక్ అకస్మాత్తుగా వస్తుంది. ఒక్కోసారి ఈ కంటి పక్షవాతం రక్తనాళాల్లో అడ్డంకులు లేకపోయినా కూడా కణజాలాలు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కూడా వస్తుంది. ఆప్టిక్ నరాలకు పోషకాలు, రక్తం ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినా కంటి స్ట్రోక్ వస్తుంది.. 50 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ఈ కంటి స్ట్రోకు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారికి కూడా దీని భారిన పడొచ్చు.. గ్లాకోమా వంటి కంటి సమస్యలతో బాధపడే వారు కూడా కంటి స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది.

మీరు చూస్తున్నప్పుడు బూడిద రంగు మచ్చలు కనబడుతున్నా, కంటి మధ్యలో రక్తం లేదా ద్రవాలు లీక్ అవుతున్నా కూడా అది స్ట్రోక్‌కు వల్ల అవ్వొచ్చు. కంటిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడి అనిపిస్తున్నా కూడా తేలిగ్గా తీసుకోవద్దు… కన్నుల్లో కొంత భాగం మబ్బు మబ్బుగా కనిపించడం కూడా కంటి స్ట్రోక్ లక్షణమే. ఎక్కువగా నిద్రలేకపోవడం, నైట్‌ షిఫ్ట్‌లు చేసేవాళ్లు ఈ స్ట్రోక్‌ భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేందుకు ప్రయత్నించండి. స్ర్రీన్‌ టైమ్‌ను తగ్గించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version