బార్, పబ్ లో ఇలాంటివి జరుగుతాయని మీకు తెలుసా?

-

సిటీ కల్చర్ అంటే ఎక్కువగా వినిపించేది పబ్ లు , బార్ లు..వీటిలో కొత్త అందాలు, రుచులు,సొగసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంద్రలోకం అని కొందరు అంటున్నారు. అసలు నిజంగా పబ్ లోపల అలాంటివి ఉంటాయా? లోపల ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బార్‌లకు, పబ్‌లకు, క్లబ్‌లకు తేడాలు ఏమున్నాయి అనే సందేహలు ఎక్కువగా కలుగుతాయి..వాటిలో మద్యం విరివిగా దొరుకుంది. బార్ కు కొన్ని లిమిట్స్ ఉంటాయి.బార్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఉంటుంది. అంటే బార్లలకు వెళ్లినవారు అక్కడే టేబుళ్ల వద్ద కూర్చుని, వెయిటర్లకు ఆర్డర్‌ ఇచ్చి, నచ్చిన మద్యం సేవించవచ్చు. ఐతే ప్రత్యేక లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే, మద్యం విక్రయాలకు బార్‌లకు అనుమతి ఉంటుంది. బార్‌లో సిగరేట్‌లు కూడా కాల్చవచ్చు..మందులోకి సరిపడా స్టఫ్ ఐటమ్స్ మాత్రమే అక్కడ దొరుకుతాయి. కేవలం తినడం, తాగడం మాత్రమే ఉంటుంది.

పబ్ అనేది పబ్లిక్ హౌస్ లాంటిది. ఇక్కడ కూడా మద్యం సేవించవచ్చు.అయితే బార్ ,పబ్‌కు కొన్ని వ్యత్యాసాలున్నాయి. సాధారణంగా బార్‌లో కొన్ని టేబుల్లు ఉంచి, ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే కూర్చుని మద్యం తాగాలి..కానీ పబ్ అందుకు డిఫరెంట్..ఎక్కడైనా తాగోచ్చు..ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి.. తాగడం, తిరగడం,డ్యాన్స్ లు, మ్యూజిక్ తో పాటు మరెన్నో ఉంటాయి. అందుకే యూత్ ఎక్కువగా ఇష్టపడతారు.

క్లబ్‌లు విశాలంగా ఉంటాయి. వీటిల్లో డ్యాన్స్ ఫ్లోర్ లేదా డ్యాన్స్ స్టేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ డ్రింక్‌ని ఆర్డర్ చేయవచ్చు లేదా కౌంటర్‌లో తీసుకోవచ్చు.. ఇందులోకి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది.పబ్ కన్నా కూడా క్లబ్ లో ఎక్కువ మంది గడపడానికి అవకాశం ఉంటుంది..

ఏది ఏమైనా కూడా ఈ మూడు యూత్ ను చెడ గోడుతున్నాయి..అయినా కూడా ఎక్కువ వాటిలోనె యూత్ గడుపుతారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version