హస్తం పంచాయితీ..ఇలా అయితే కష్టమే!

-

ప్రతి చిన్నదాన్ని సాగదీసి రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటు ఉన్నట్లు ఉంది…మిగతా పార్టీలు ఏమో ఎక్కడకక్కడ దూసుకెళ్లుపోతుంటే..ఇంకా కాంగ్రెస్ పార్టీ పాతకాలం పద్ధతులని అనుసరిస్తూ…బాగా ల్యాగ్ చేస్తుంది. దీని వల్ల పార్టీకి పెద్ద ప్రయోజనం లేదనే చెప్పాలి. వాస్తవానికి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు పదవి నియామకంలోనే కాంగ్రెస్ బాగా లేటు చేసింది.

సరే ఎలాగోలా రేవంత్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టింది..ఆ తర్వాత దూకుడుగా రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎక్కడకక్కడ బ్రేకులు పడేలా అధిష్టానం రాజకీయం ఉంటుంది. ప్రతి అంశాన్ని పెద్దగా చర్చించడం చేస్తుంది. పార్టీలో ఎవరైనా చేరాలంటే..ఏదో పెద్ద కమిటీ ఏర్పాటయ్యి…వారు కొన్ని రోజులు చర్చించుకుని, ఆ కమిటీ ఏమో అధిష్టానానికి నివేదిక ఇచ్చి..ఆ నివేదిక చూసి..నేతలని చేర్చుకోవడానికి పెద్ద తలనొప్పి అయిపోయింది.

ఇక ఏదైనా ఎన్నికలో ఓటమి పాలైతే…దాని గురించి కొన్ని రోజులు చర్చలు…అయిపోయిన దానికి పెద్ద ఎత్తున చర్చలు చేస్తారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే చేస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి పార్టీ మార్పు ఖాయమైంది..ఆయన బీజేపీలోకి వెళ్ళడం ఫిక్స్…అలాంటప్పుడు ఆయనతో బుజ్జగింపులు అని, వేటు వేయడం అని చర్చలు చాలారోజులు చేస్తున్నారు. సరే బుజ్జగించిన ప్రయోజనం లేదు అనుకుంటే…వేటు వేయడం అనేది నెక్స్ట్..వేటు వేసిన వేయకపోయిన కోమటిరెడ్డికి పోయేది ఏమి లేదు..ఎలాగో ఆయన బీజేపీలో చేరడం ఖాయం.

అలాంటప్పుడు కోమటిరెడ్డి విషయంలో ఏదొక నిర్ణయం తీసుకుని, మిగతా కార్యక్రమాలని చేస్తే కాంగ్రెస్ పార్టీకే బెనిఫిట్. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయడం లేదు. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. పదేపదే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న రాజగోపాల్‌పై సస్పెన్షన్‌ వేటు వేసే అంశాన్ని పరిశీలించారట. అంటే ఇంకా పరిశీలించడంలోనే ఉన్నారు. ఇలాగే ల్యాగ్ చేసుకుంటూ వెళితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వెనుకపడిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news