ఫ్యాన్స్ మధ్య మంట పెట్టిన దిల్ రాజు కామెంట్స్.!

-

ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  స్టార్ హీరో దళపతి విజయ్ తో మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు.హీరో విజయ్ కి వున్న  రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా  జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. సంక్రాంతి కి అజిత్ సినిమా వలిమై కూడా రిలీజ్ కు సిద్దంగా ఉంది.

వారసుడు కోసం దిల్ రాజు రూ.250 కోట్ల వరకు పెట్టారట దీని రికవరీ కోసం చాలా టెన్సన్ పడుతున్నారు.ఇక ఒక ఇంటర్వ్యూ లో దిల్ రాజు  చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు లో  విజయ్ మరియు అజిత్ మధ్య గొడవలు జరిగేలా చేసాయి.విజయ్  అందరికంటే పెద్ద స్టార్. తమిళంలోి ఆయనకు పెద్ద మార్కెట్ వుంది. అన్న వ్యాఖ్యలు దీనికి మూల కారణం. అసలే ఫ్యాన్స్ మధ్య విపరీతంగా గొడవలు జరిగే తమిళనాడు లో ఇది అగ్నికి ఆజ్యం పోసింది.

ఈ కామెంట్స్ మేము ఒప్పుకొం అని అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు పై మండి పడ్డారు. విజయ్ కన్నా మా హీరోనే మంచి నటుడంటూ అజిత్ ఫ్యాన్స్… ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే పెద్ద యుద్దమే జరుగుతోంది. ఇక సినిమా విడుదల రోజు ఇంకెంత రచ్చ ఉంటుందో అని అందరూ భయపడి చస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version