ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దర్శకుడు బాబి తండ్రి కొల్లి మోహన్ రావు గత కొద్ది కాలం నుండి కాలయానికి సంబంధించిన సమస్యతో బాధపడుతుండగా.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఈరోజు మధ్యాహ్నం 12:15 గంటలకు తుది శ్వాస విడిచారు. బాబీ ఇంట జరిగిన ఈ విషాద ఘటనపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. బాబి తండ్రి కొల్లి మోహన్ రావు (69) పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం గుంటూరులోని నాగారంపాలెం కి తరలించనున్నారు. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.