అక్క ఎంట్రీ ఇస్తే.. అలాంటి పెళ్లిళ్లు ఆగాల్సిందే..!

-

ఆమె పేరు కోయెల్.. వయసు 19 ఏళ్లు.. ఈమెను తన ఊర్లో వారంతా..విలన్ గా చూస్తున్నారు.. కారణం.. బాల్యవివాహాలను ఆపడమే.. కోయెల్ తన బృందంతో ఎక్కడ జరుగుతున్న అడ్డుకుంటుంది. దాంతో ఈమెకు అత్యాచారం చేస్తామని, చంపుతామని బెదిరింపులు పెరిగాయి. అయినా తగ్గేదేలేదంటుంది కోయెల్.
సిలిగురి ప్రాంతంలో కోయెల్‌ తనలాంటి అమ్మాయిలతో కలిసి గస్తీ కాస్తోంది. ఈ అమ్మాయి సిలిగురి (పశ్చిమ బెంగాల్‌) సమీపంలో ఉండే ఒక గ్రామంలో ‘వరల్డ్‌ విజన్‌ ఇండియా’ అనే ఎన్‌.జి.ఓతో కలిసి పని చేస్తుంది. ఆమె చేసే ప్రధానమైన పని బాల్య వివాహాలను నిరోధించడం.. ఇందుకు ఆమెతో పాటు 25 మంది అమ్మాయిల బృందం ఉంది. చుట్టుపక్కల ఊళ్లలో ఎక్కడ బాల్యవిహహాలు జరుగుతున్నాయా అని గస్తీకాయడమే వీరి పని.

పగపట్టిన పెద్దోళ్లు..

అంత ఖర్చుపెట్టి పెళ్లి చేస్తుంటే.. వీళ్లు వచ్చి ఆపడం పెద్దవాళ్లకు నచ్చదు కదా..! పగపట్టారు. మాకు లేని నొప్పి నీకెందుకు వధువు, వరుడి తల్లిదండ్రులు కోయెల్‌తో తగాదాకు వచ్చేవాళ్లు…ఇప్పటికే రెండుసార్లు తన ఇంటి మీదకు జనం దాడికి వచ్చి… తనను, తన చెల్లెల్ని చంపుతామని బెదిరించారట. తనను అయితే రేప్‌ చేస్తాం అన్నారు. ట్యూషన్‌ నుంచి వస్తుంటే ఒకసారి తన మీద రాళ్ల దాడి జరిగితే సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లడమే మానేసింది కోయెల్.. కాని బాల్య వివాహాలను ఆపడం మాత్రం మానలేదు.

ఎందుకు ఇంత మొండిపట్టుదల..

జీవితంలో ఎదురైన ఘటనలే మనిషిని మొండిగా మారుస్తాయి. కోయెల్ జీవితంలో కూడా అంతే.. వాళ్ల అమ్మకు 17 ఏళ్ల వయసులో 35 ఏళ్ల తన నాన్నతో పెళ్లి జరిపించారు. పుట్టిన మూడేళ్లకు కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడట. అమ్మకు ఎన్నో ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలు ఉండేవి. పెళ్లితో అన్నీ నాశనం అయ్యాయి. అందుకే బాల్యవివాహాలకు మొండిపట్టు పట్టింది కోయెల్.
తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నా ఆడపిల్లలు నిజంగా చదువుకోవాలని కోరుకుంటున్నారు. జీవితంలో ఏదో ఒక మేరకు స్థిరపడాలనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం చూడగానే కోయెల్‌కు పెళ్లికూతుర్లు సమాచారం ఇస్తారుట. కోయెల్‌ తన దళంతో వెళ్లి పెళ్లి ఆపు చేస్తోంది. ‘పెళ్లి ఆపించి ఊరుకోవడం లేదు. అలాంటి ఆడపిల్లల స్వయం ఉపాధికి లేదా తల్లిదండ్రుల ఉపాధికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తుందట.

చైల్డ్ ట్రాఫికింగ్ కూడా..

బాల్య వివాహాలు ఆపడమే కాదు నేపాల్‌ సరిహద్దుకు దగ్గర కాబట్టి.. చైల్డ్‌ ట్రాఫికింగ్‌ జరక్కుండా కూడా అడ్డుకునే పని కోయెల్‌ దళం చేస్తుందట. ఇంత చిన్న వయసులోనే సమాజంకు సేవ చేయాలనే ఆలోచన.. ఎన్ని బెదిరింపులు వచ్చిన ఎదురుతిరిగే ధైర్యం నేటి ఎంతోమంది అమ్మాయిలకు బలాన్ని ఇస్తుంది. ఆమె లాంటి పిల్లలు ప్రతి ఊర్లో ఉండాలి.!

Read more RELATED
Recommended to you

Latest news