రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే బిజెపి నాయకులకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నేడు అంబర్పేట్ లోని గోల్నాకాలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ప్రధాని మోదీ అనడం హాస్యాస్పదమని అన్నారు.
కుల, మతాల పేరుతో లబ్ధి పొందాలని బిజెపి చూస్తుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు మంత్రి తలసాని. అంబర్ పేటకు 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గత నాలుగేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా అంబర్పేటలో ఓడిపోవడంతోనే కేంద్ర మంత్రి కాగలిగారని, అందుకు బిఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు.