ఆర్థిక ఏడాది 2022-23 ఈ నెల మార్చి 31తో ముగిసిపోతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 మొదలు అవుతుంది. అప్పటి నుండి న్యూ రూల్స్ వస్తాయి. అలానే మార్చి 31 ఏ కొన్ని పనులకి డెడ్‌లైన్. వాటిని పూర్తి చేసుకోవాలి. లేకపోతె ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రతీ ఒక్కరు కూడా వారి పాన్ కార్డు ని ఆధార్ తో లింక్ చేసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చాలా సార్లు ఈ విషయం పై హెచ్చరించింది. ఏడాది క్రితమే దీనికి గడువు ముగిసింది. కానీ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం రూ.1000 జరిమానాతో లింక్ చెయ్యచ్చు.
అది కూడా మార్చి 31, 2023 లోపు చేయాలి. లేకపోతే మీ పాన్ కార్డు పని చేయదు. అలానే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ పేరు తో పేరుతో పింఛను పథకాన్ని తీసుకొచ్చారు. 60 ఏళ్ల తర్వాత ఆదాయం కోల్పోయే వారికి ఈ స్కీమ్ బాగా పని చేస్తుంది. ఈ స్కీమ్ కి 2023, మార్చి 31 చివరి గడువు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ఈ స్కీమ్ లో పెట్టచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ తో 7.4 శాతం వడ్డీ ని పొందొచ్చు. 10 ఏళ్ల పాటు ఇదే వడ్డీ ఉంటుంది. అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలశ్ ప్లాన్ గురించి మీకు తెలిసే ఉంటుంది.
ఇది 400 రోజుల ఎఫ్‌డీ స్కీమ్. 7.10 శాతం వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.60 శాతం వడ్డీ ఇస్తోంది. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పేరుతో ఇంకో స్కీమ్ ని తీసుకొచ్చారు. ఇండియన్ బ్యాంక్ ఇండ్ శక్తి 555 డేస్, పీఎస్‌బీ ఫ్యాబ్యులస్ 601 డేస్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ పీఎస్‌బీ ఫ్యాబ్యులస్ 300 డేస్ పథకాలు కి కూడా మార్చి 31 వరకే గడువు. అదే విధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఈనెల 31లోపు నామినీని తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఒకవేళ అవసరం లేదని అనుకుంటే డిక్లరేషన్ సబ్మిట్ చెయ్యాలి.