మార్చి 31 వరకే సమయం… ఇలా వెంటనే చేసేయండి మరి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఆధార్ ని పాన్ కార్డు ని లింక్ చెయ్యడం మాత్రం మరచిపోవద్దు. పాన్ కార్డు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్ ఏ. మార్చి 31 లోగా లింక్ చేసుకోండి. లేదంటే మాత్రం ఇబ్బంది పడాలి. ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అలాగే పెనాల్టీల భారం మోయాల్సి వస్తుంది కూడా.

ఇదిలా ఉండగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో చేరిన వాళ్ళు కూడా వారి పాన్ కార్డు ని ఆధార్ తో లింక్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ పెన్షన్ రెగ్యులేటర్ పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త రూల్స్ ని చూస్తే.. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు పక్కా పాన్ కార్డు ని వారి ఆధార్ తో లింక్ చేసుకోవాల్సి వుంది. ఒకవేళ లింక్ చేసుకోక పోతే లావాదేవీల పై పరిమితులు లేదా ఆంక్షలు అమలు లోకి వస్తాయి. ఏప్రిల్ 1 నుంచే ఈ రూల్స్ అమలు లోకి వస్తాయని అన్నారు. ఎన్‌పీఎస్ అకౌంట్లకు పక్కా పాన్ ఉండాలి. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్ కచ్చితంగా కేవైసీ ఉండాలి.

సో ఈ స్కీమ్ లో చేరిన వెంటనే ముందు ఈ పని చెయ్యాల్సి వుంది. ఆదాయపు పన్నుచట్టం ప్రకారం చూస్తే ఆధార్ వున్నవాళ్లు పక్కా వారి పాన్ కార్డు తో లింక్ చెయ్యాల్సిందే. నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సీబీడీటీ ప్రకారం 2023 మార్చి 31 నాటికి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే… ఆ పాన్ కార్డు పని చెయ్యదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌లో చేరిన వారు కనుక లింక్ చెయ్యలేదు అంటే కేవైసీ కలిగి లేనట్లు అవుతుంది. ఎన్‌పీఎస్ ట్రాన్సాక్షన్లపై అప్పుడు ఆంక్షలు అమలులోకి వస్తాయి. కానీ పాన్ కార్డు కలిగిన వారు వెంటనే ఆధార్‌ తో దాన్ని లింక్ చేసుకోండి. లేదంటే ఇబ్బంది పడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version