ఆ హీరోయిన్‌తో బాలయ్య లవ్ స్టోరి.. ఈ విషయం మీకు తెలుసా?

-

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ..భోళా మనిషి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లాడి మనస్తత్వం కలిగిన బాలయ్య..తనకు ఏది అనిపిస్తే అది వెంటనే చేసేస్తుంటారు. ప్రజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107వ ఫిల్మ్ చేస్తు్న్నారు. ఇక బాలయ్య వ్యక్తిగత జీవితం విషయానికొస్తే..ఆయన తన బంధువుల అమ్మాయి అయిన వసుంధరను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే. కాగా, బాలయ్యకు ఒక లవ్ స్టోరి కూడా ఉందండోయ్..ఓ హీరోయిన్ ను బాలయ్య సిన్సియర్ గా లవ్ చేశారట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్) వారసుడిగా అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బాలయ్య కొనసాగుతున్నారు. హిందూపూర్ శాసన సభ్యుడిగా ప్రజలకు సేవలందిస్తూనే ప్రముఖ సినీ నటుడిగా సినిమాలు చేస్తున్నారు. ఇక బాలయ్య లవ్ స్టోరి విషయానికొస్తే.. ఆయన హీరో అయిన కొత్తల్లోనే బాగా రాణించారు.

బాలయ్య నటించిన సినిమాలు వరుస విజయాలు అందుకున్నాయి. ఈ క్రమంలోనే మద్రాస్ కు చెందిన ఓ హీరోయిన్ ను బాలయ్య సిన్సియర్ గా లవ్ చేశారట. ఈ విషయం తన అన్న హరికృష్ణ, తండ్రి ఎన్టీఆర్ లకు తెలిసింది. దాంతో వారు కాకినాడకు చెందిన బంధువుల అమ్మాయి అయిన వసుంధరను బాలయ్యకు ఇచ్చి పెళ్లి జరిపించారు.

తను నిజంగానే చెన్నై కు చెందిన ఓ హీరోయిన్ ను లవ్ చేశానని తనతో సన్నిహితంగా వారితో బాలయ్య చెప్పారట. ఈ విషయాలను వారు ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కర్ రావు కూడా బాలయ్య ఓ హీరోయిన్ ను లవ్ చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

బాలయ్య ఈ విషయం అప్పుడప్పుడు సెట్ లో కొంత మందితో పంచుకున్నారని సమాచారం. బాలయ్య సినిమాల విషయానికొస్తే ఆయన గత చిత్రం ‘అఖండ’ను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. NBK 107ఫిల్మ్ కోసం సినీ లవర్స్, బాలయ్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version