మెగా అభిమానులకు కన్నుల పండుగే..‘ఆచార్య’లో చరణ్ పాత్ర నిడివి ఎంతంటే?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడే కాదు తండ్రిని మించిన తనయుడనే పేరు తెచ్చుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ నటన పట్ల ఇండస్ట్రీ ప్రముఖులే కాదు సినీ ప్రేక్షకులూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం వచ్చే నెల 29న విడుదల కాబోతుంది. ఈ పిక్చర్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల.. కొవిడ్ వలన చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరు సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా, చెర్రీకి జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర నిడివి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

‘ఆచార్య’ ఫిల్మ్ లో రామ్ చరణ్ తేజ్ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడని మేకర్స్ అప్పట్లో పేర్కొన్నారు. అయితే, ఈ పాత్ర నిడివి అరగంటే ఉంటుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా వెండితెరపైన తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ ల కలయిక అపూర్వంగా ఉంటుందని మేకర్స్ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ రన్ టైమ్ త్రీ హవర్స్ అని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్స్‌పై నిరంజ‌న్ రెడ్డి , అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా ‘చానా కష్టం వచ్చింది మందాకిని’ అనే స్పెషల్ సాంగ్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version