పవన్ కల్యాణ్ తప్పుకు క్షమాపణ చెప్పిన చిరంజీవి..అసలేం జరిగిందంటే?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..స్వయం కృషికి మారు పేరు అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఎలాంటి అండదండలు లేకుండా ఆయన నటన, క్రమశిక్షణను నమ్ముకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ అయ్యారు. అయితే, చిరంజీవి కుటుంబంలో నుంచి వచ్చిన హీరోలకు మాత్రం ఎంట్రీ చాలా ఈజీ అయిపోయింది.

చిరంజీవి కొంత కాలం పాటు రాజకీయాల్లోకి వెళ్లినా..మళ్లీ సినిమాల్లోకి వచ్చి ఫుల్ బిజీ అయిపోయారు. ఈ సంగతులు పక్కనబెడితే..చిరంజీవి స్వభావరిత్యా మృదుస్వభావి అని చెప్పొచ్చు. ఏ పనైనా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అలా చిరంజీవి తన కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్ల నుంచి వ్యవహరిస్తున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.

అప్పుడు స్థానికంగా ఉండే కొందరు గుండాలు, ఆకతాయిలు షూటింగ్ దగ్గరకు వచ్చి డైరెక్టర్ ను దూషించారట. ఆ విషయం చిరంజీవి పెద్దగా పట్టించుకోలేదట. దాంతో కారు డ్రైవర్ ఒకరు ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలిపారట.

Megastar Chiranjeevi reacts to PawanKalyan defeat

పవన్ కల్యాణ్ వచ్చి వారితో మాట్లాడి గొడవ చేయొద్దని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కరాటేలో పట్టున్న పవన్ కల్యాణ్ వారితో గొడవ పడగా, ఒకిరికి బలంగా గాయాలయ్యాయట. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి..సదరు బాధితుడి వద్దకు వెళ్లి తన తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున క్షమాపణలు చెప్పారట. దాంతో పాటు వారికి ఖర్చులకు డబ్బులిచ్చారని సమాచారం. ఇక ఆ తర్వాత గొడవలకు వెళ్లొద్దని పవన్ కల్యాణ్ వద్ద నుంచి మాట తీసుకున్నారట చిరు.

Read more RELATED
Recommended to you

Latest news