రెండ్రోజులు తిండి లేక తల్లడిల్లిన ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ.. తర్వాత..!!

-

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా మంది అహర్నిషలు కష్టపడుతుంటారు. దర్శకుడిగానో, హీరోగానో, టెక్నీషియన్ గానో రాణించాలని సినీ పరిశ్రమ పెద్దలను కలుస్తుంటారు. ఆఫీసులు, స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు కూడా. అలా సినిమా కష్టాలు పడి ఆ తర్వాత కాలంలో చక్కటి పొజిషన్ లో ఉన్న వారు చాలా మందే ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తియే ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ. చెన్నైకి వెళ్లి సినిమా కష్టాలు పడ్డ కృష్ణవంశీ.. ఒకానొక సమయంలో రెండ్రోజుల పాటు భోజనం చేయలేదు. అప్పుడు ఆయనకు ఎవరు హెల్ప్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి వరుస విజయాలను అందుకోవడంతో పాటు ఆర్జీవీ శిష్యుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు వంశీ. అయితే, తొలినాళ్లలో ఆర్జీవీ వద్ద అసిస్టెంట్ గా పని చేసే క్రమంలో తినడానికి తిండి లేక అల్లాడిపోయాడు కృష్ణ వంశీ. ఆ టైమ్ లో రూమ్ మెట్ ఉన్న ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఓ సందర్భంలో సాయం చేసినట్లు స్వయంగా కృష్ణవంశీ తెలిపాడు.

తాను ఒక రోజు బ్రహ్మాజీతో మాట్లాడుతుండగా, తిందాం రా అని బ్రహ్మాజీ పిలిచాడని గుర్తు చేసుకున్నాడు వంశీ. అప్పటికీ ఆయన భోజనం చేయక రెండ్రోజులు అయిందని, అలా తనకు అన్నం పెట్టిన బ్రహ్మాజీ రుణం తీర్చుకునేందుకు వంశీ తర్వాత ప్రయత్నించాడు. తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. అయితే, తాను ఊరికే భోజనం సమయం అయిందని కృష్ణవంశీని భోజనం చేయాలని అడిగానని, ఇప్పటికీ ఆ విషయం గుర్తు పెట్టుకుని బయటకు చెప్తుండటం కృష్ణవంశీ గొప్పతనమని బ్రహ్మాజీ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

 

‘గులాబీ’ చిత్రంలో కీలక పాత్ర బ్రహ్మాజీకి ఇచ్చిన కృష్ణవంశీ.. ఆ తర్వాత ‘సింధూరం’ మూవీలో లీడ్ రోల్ ప్లే చేసే చాన్స్ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఇందులో బ్రహ్మాజీ నటనకు మంచి మార్కులు వేశారు ప్రేక్షకులు. ఇక ఆ తర్వాత ‘చంద్రలేఖ’ చిత్రంలో బ్రహ్మాజీకి కామెడీ రోల్ ఇచ్చారు కృష్ణవంశీ. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’ త్వరలో విడుదల కానుంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version