తెలంగాణ ప్రతీకకు సాక్ష్యం బతుకమ్మ.. ప్రకృతిని ఆరాధించే పండుగ..బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి.
ఈ పూలతో గౌరమ్మను తయారు చేసి తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో పూజిస్తారు..దక్షిణ భారతదేశంలోని దేవాలయాలలో కనిపించే ‘గోపురం’తో పోల్చవచ్చు. బతుకమ్మ అంటే ‘జీవించు తల్లి’ అని అర్థం. ఇంటిలోని స్త్రీలు పంట పండించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇంటి శ్రేయస్సు కోసం ఆమె ఆశీస్సులను కోరుకుంటారు.
మొదటి ఏడు రోజులు మహిళలు చిన్న బతుకమ్మ లతో పాటు మట్టితో బొడ్డెమ్మ (గౌరీ దేవత) ప్రతీకాత్మక చిత్రాలను తయారు చేస్తారు. ప్రతి రోజు సూచించిన ‘నైవేద్యం’ సమర్పిస్తారు. ఇందులో నువ్వులు, బియ్యం పిండి, తడి బియ్యం, బెల్లం మొదలగునవి ఉంటాయి..
1) ఎంగిలి పూల బతుకమ్మ 2) అటుకుల బతుకమ్మ, 3) ముద్దపప్పు బతుకమ్మ 4) నానే బియ్యం బతుకమ్మ 5) అట్ల బతుకమ్మ..6) అలిగిన బతుకమ్మ..ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు.. 7)వేపకాయల బతుకమ్మ.. 8) వెన్నముద్దల బతుకమ్మ.. 9) సద్దుల బతుకమ్మ..మొదటిరోజు చేసుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. అంటే 25 పెత్తర అమావాస్య రోజు రానుంది. ప్రతి ఏడాది పెత్తర అమావాస్య రోజే మొదలవుతుంది..
తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆడతారు..సద్దుల బతుకమ్మ, ప్రత్యేక పళ్లెంపై మహిళలు భారీ బతుకమ్మలను సిద్ధం చేస్తారు. పూలు పేర్చడంలో ఆటలు పాటలతో వేడుకలు చేసుకుంటారు. సాంప్రదాయకంగా ఆ పువ్వులు స్త్రీలు దాదాపు ఒకే రకమైన పువ్వులను ఉపయోగిస్తున్నప్పటికీ, రెండు బతుకమ్మలు ఒకేలా ఉండవు. మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలసి ‘బతుకమ్మ’ ఆడతారు. ఈరోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు..చివరి రోజు ఘనంగా ఆడి, పాడి అమ్మవారిని నిమర్జనం చేస్తారు.