ఏపీ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను చేసింది. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఇదిలా ఉంటే….. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపక్ష టీడీపీ-జనసేన వెల్లడించింది.పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (రవీంద్రనాథ్ రెడ్డి)ని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇదివరకు సతీశ్ రెడ్డి పోటీ చేయగా.. తొలిసారి ఈయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బరిలో నిలవనున్నారు. బీటెక్ రవి మాస్ లీడర్ గా పేరొందారు. వివేకా హత్య, YS కుటుంబంలో విభేదాలు తన గెలుపునకు కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా 1978 నుంచి ఈ నియోజకవర్గం YS కుటుంబానికి కంచుకోటగా ఉంది.