ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీ నిలబడటం అనేది కష్టంగానే ఉండవచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు చాలా వరకు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమౌతుంది. భారతీయ జనతా పార్టీ లో చాలా మంది నేతలు పార్టీలో ఉండడానికి నానా కష్టాలు పడుతున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఏంటి అంటే భారతీయ జనతా పార్టీలో ఉండడానికి చాలా మంది నేతలు ఇష్టపడక జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర నాయకత్వం బలంగా లేకపోవడం… పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకత్వం మీద ఎక్కువగా దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చాలా మంది నేతలు చూస్తున్నట్టుగా రాజకీయ వర్గాలలో ప్రచారం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీకి కొన్ని కొన్ని అంశాలు కీలకం గా ఉన్నాయి. అందుకే జనసేన పార్టీలోకి బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ అలాగే ఎమ్మెల్సీ మాధవ్ వంటి వారు బిజెపి నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ వాళ్ళకు వాళ్ళకు నియోజకవర్గాన్ని కూడా కేటాయించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపించే అవకాశాలు కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కాస్తో కూస్తో ప్రభావం చూపించింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో మంచి ప్రభావం కనపడింది. అందుకే ఇప్పుడు జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.