తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అయితే చాలా మంది కమెడియన్స్ మాటీవి అదిరింది షో కు వెళ్లి పోయారు.జడ్జి గా వున్న నాగబాబు వెళ్ళిపోయారు. రోజా కూడా ఇటీవల మంత్రి పదవి రావడంతో షో కు గుడ్ బై చెప్పింది.
ఇక కమిడియన్స్ చాలా మంది నాగబాబు తో జీ తెలుగు ఛానెల్ కు వెళ్ళి అదిరింది కామెడీ షో లో చేశారు. కొన్ని రోజులు అదరగొట్టిన షో తర్వాత చేతులు ఎత్తివేయడం చేసింది. దీనితో ఎలారా దేవుడా అంటున్న నేపథ్యంలో మళ్లీ స్టార్ మా టీవీ ఛానెల్ వారు కామిడీ స్టార్ లో అవకాశం ఇచ్చారు. ఇక ఈ షో ద్వారా రేటింగ్స్ పెరుగుతున్న నేపథ్యంలో, ఏమైందో ఏమో తెలియదు కాని ఈ షో కూడా ఆగి పొయింది.
ఇప్పుడు ఈ కమిడియన్స్ పరిస్థితి దారుణంగా ఉందట. ఒక పక్క ఈఏమ్ఐ లు కట్టాల్సి రావడం, బ్యాంక్ లోన్లు, అప్పులు తీసుకుని ఉండడం తో ఎటూ పాలు పోవడం లేదట.దీనితో జబర్దస్త్ షోకి మళ్లీ వస్తామని మొర పెట్టుకుంటున్న గాని మల్లె మాల వాళ్ళు పట్టించుకోవడం లేదట. ఇక లాభం లేదనుకుని కమెడియన్ కిరాక్ ఆర్పీ.కూకట్‌పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. ఇందులో చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. ఇలా అన్నీ కట్టెలపొయ్యి మీదనే వండుతారట. మంచిగా క్లిక్ అయితే నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్స్ మరిన్ని పెట్టాలని చూస్తున్నాడట.