మరొకసారి అధికార పీఠం దక్కించుకోవాలని జగన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు..అది కూడా గతంలో కంటే ఎక్కువగా సీట్లు గెలుచుకోవాలని అనుకుంటున్నారు. ఏకంగా 175కి 175 సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నారు. అసలు ఈ మూడేళ్ళల్లో ప్రజలకు అంతా మంచే చేశామని, అలాంటప్పుడు ప్రజలు తమ వైపే ఉంటారని, ఆఖరికి కుప్పం ప్రజలని కూడా తమ వైపు తిప్పుకున్నామని, కాబట్టి 175కి 175 ఎందుకు గెలవకూడదని జగన్ అంటున్నారు.
సరే జగన్ అనుకోవడంలో తప్పు లేదు…కానీ నిజంగా 175కి 175 సీట్లు గెలవగలుగుతారా? అంటే అది సాధ్యపడదనే చెప్పొచ్చు. ఎందుకంటే గతం కంటే బలంగా టీడీపీ పుంజుకుంది…ఇటు పవన్ కల్యాణ్ సైతం బలపడుతున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఎంత కాదు అనుకున్న ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది ఇదే.
అలాంటప్పుడు జగన్ గెలవాలంటే…ముందు మార్చుకోవాల్సింది ఎమ్మెల్యేలని. ఎందుకంటే తన పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు..ఇప్పటికీ జగన్ కు జనంలో ఆదరణ ఉంది..కానీ ఎమ్మెల్యేలకే ఆదరణ తగ్గుతుంది. కాబట్టి ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పర్చుకోవాల్సిందే. ఇప్పటికే జగన్…ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు..పనితీరు బాగోని వారికి సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు…ఆరు నెలల్లో పనితీరు మెరుగు పర్చుకోకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని చెప్పేశారు.
అయితే ఇలా వార్నింగ్ ఇచ్చిన కూడా కొందరు ఎమ్మెల్యేల్లో పెద్దగా మార్పు వచ్చినట్లు లేదు. అందుకే మరొకసారి జగన్…ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటారని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల అయిన వెంటనే…ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుని, మరొకసారి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి ఏ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయకపోయిన జగన్…కాస్త సీరియస్ గానే వారికి వార్నింగ్ ఇచ్చేలా ఉన్నారు. అలాగే మొహమాటం లేకుండా సీటు కూడా ఇవ్వరని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి సీటు ఇచ్చే విషయం డౌటే అని సమాచారం. మొత్తానికైతే ఎమ్మెల్యేలు సరిగ్గా ఉంటేనే జగన్ కు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు.