బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత గర్భిణీలలో స్ట్రెచ్ మార్క్స్ చాలా సహజం. చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతూ ఉంటారు. స్ట్రెచ్ మార్క్స్ ని తొలగిపోవాలంటే కచ్చితంగా మీరు వీటిని పాటించాలి. గర్భం దాల్చిన తర్వాత మహిళల్లో స్ప్రెచ్ మార్క్స్ అనేవి ఉండిపోతుంటాయి. దాంతో చాలా మంది రకరకాల క్రీమ్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో పొట్ట కండరాలతో పాటుగా చర్మం కూడా బాగా టైట్ గా అయిపోతుంది. దానితో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. గర్భంతో ఉన్నప్పుడు వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ కాలం చర్మం మీద ఉంటాయి. దీంతో డెలివరీ అయిన తర్వాత గుర్తులు అలా ఉండిపోతుంటాయి.
అయితే కడుపుపై వచ్చిన స్ట్రెచ్ మార్క్లని తొలగించడానికి విటమిన్ సి చాలా ముఖ్యం. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే చర్మ ఆరోగ్యం బాగుంటుంది. ప్రెగ్నెన్సీలో జామ నారింజ వంటివి తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ రావు. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు. విటమిన్ ఏ ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే చర్మం టైట్ గా ఉంటుంది.
విటమిన్ ఈ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు. గుమ్మడికాయ గింజలు, పీనట్ బటర్ వంటివి తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ సమస్య ఉండదు. గర్భిణీలు ప్రెగ్నెన్సీలో ఎక్కువ నీళ్లు తాగితే కూడా ఈ సమస్య ఉండదు. విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోండి. జింక్ ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ ఉండవు. ఇలా ఈ చిన్న చిన్న విషయాలని పాటిస్తే బిడ్డ పుట్టిన తర్వాత ఈ సమస్య ఉండదు.