ఇలా చేస్తే ప్లేట్లెట్స్ పెరుగుతాయి.. హెల్తీగానూ ఉండొచ్చు..!

-

చాలా మంది ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్లేట్లెట్స్ ని పెంచుకోవాలంటే వీటిని తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే ప్లేట్లెట్ల కౌంట్ పెరుగుతుంది. పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కె కూడా ఉంటుంది. ప్లేట్లెట్స్ ని పెంచుకోవడానికి పాలను తీసుకోండి. అలాగే రక్తం గడ్డ కట్టడాన్ని కూడా ఇది నివారిస్తుంది. ప్రోటీన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. కండరాల ఎదుగుదలకు సహాయపడుతుంది. అలాగే ఆకుకూరల్ని కూడా తీసుకోవాలి ఆకుకూరల్లో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ప్లేట్లెట్స్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.

బచ్చలికూర, తోటకూర, పాలకూరని మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. అలాగే కివి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ప్లేట్లెట్స్ ని పెంచుకోవడానికి ఇవి కూడా సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం కూడా బావుంటుంది. కలబంద పోషకాలతో ఉంటుంది. జింక్, పొటాషియం, మెగ్నీషియం ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ప్లేట్లెట్స్ ని పెంచుకోవడానికి కలబంద చక్కగా పనిచేస్తుంది.

కలబంద జ్యూస్ తీసుకుంటే ప్లేట్లెట్స్ బాగా పెరుగుతాయి. సిట్రస్ పండ్లను తీసుకుంటే కూడా ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. సిట్రస్ పండ్లలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్లేట్లెట్స్ ని పెంచుకోవడానికి దానిమ్మ కూడా సహాయపడుతుంది. దానిమ్మలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ సౌందర్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజలు కూడా ప్లేట్లెట్స్ కౌంట్ ని పెంచుకోవడానికి సహాయపడతాయి. కోడి గుడ్లని బొప్పాయిని కూడా డైట్లో చేర్చుకోండి ఇవి కూడా ప్లేట్లెట్స్ ని సులువుగా పెంచుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version