రాష్ట్రంలో రోజురోజుకూ ఎదుగుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ గట్టిగానే ట్రై చేస్తుంది…ఎప్పటికప్పుడు బీజేపీ రాజకీయ యుద్ధం తీవ్రతరం చేస్తుంది..ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఒకోసారి చిక్కుల్లో పడుతుంది. దీంతో పార్టీకి డ్యామేజ్ పెరుగుతుంది. అయితే ఎలాగోలా బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికే టీఆర్ఎస్ ట్రై చేస్తుంది…కానీ ఎంతగా కౌంటర్లు ఇచ్చినా సరే…రివర్స్ లో కారు పార్టీకి అదిరిపోయే కౌంటర్లు బీజేపీ నేతలు వేస్తున్నారు.అసలు కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయడం లేదని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఇదే పాయింట్ తో టీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. ఇక దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు తమదైన శైలిలో రాష్ట్రానికి కేంద్రం ఎంత సాయం చేసిందనే అంశంపై ఆర్టీఐ చట్టం ద్వారా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ద్వారా రాష్ట్రానికి కేంద్రం ఎంత సాయం చేసిందో తెలుసుకుని, వాటిని తెలంగాణ ప్రజలకు వివరించేలా బీజేపీ ప్లాన్ చేసుకుంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం….సిబిఐ, ఈడీ కేసులు అంటూ రాజకీయ నేతలని వేధిస్తుందని టీఆర్ఎస్ ఫైర్ అవుతుంది. అయితే తప్పు చేసిన వారిని ఈడీ విచారిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఏమన్నా తప్పులు జరిగితే…వాటిని ప్రశ్నిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టి ఎలా వేధించిందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అవుతున్నారు.
తాజాగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న వారు…అదిరిపోయే లాజిక్ లతో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేస్తుందే కేసీఆర్ అని, టీఆర్ఎస్ ఒక తెలంగాణ ద్రోహుల పార్టీగా ఉందని, టీఆర్ఎస్ మంత్రుల్లో సగం మంది తెలంగాణ వద్దన్న వారే అని కౌంటర్ ఇచ్చారు. ఈటల-కిషన్ రెడ్డిల మాటల్లో లాజిక్ ఉంది…ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, టీఆర్ఎస్ లో చాలామంది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసే వారు ఉండటం నిజమే. మొత్తానికైతే బీజేపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదు.