బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో 5 గంటలుగా విచారిస్తున్నారు. ఐదు ఈడీ బృందాలు ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఎమ్మెల్సీ కవితను విచారణ చేస్తున్నారు. విచారణను మహిళా అధికారి సమక్షంలో అధికారులు వీడియో షూట్ చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ కావాల్సిన సమాచారం మొత్తం తీసుకుంటుంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారిస్తున్నారు ఈడి అధికారులు.
తొలుత కవిత వ్యక్తిగత సమాచారాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అరుణ్ పిళ్లై రిపోర్ట్, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితపై అధికారులు ప్రశ్నలు అడుగుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు ఆ తర్వాత మళ్లీ విచారణను స్టార్ట్ చేశారు. మహిళ కాబట్టి సాయంత్రం 6 గంటల వరకే విచారించాలి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కవితను విచారించే అవకాశం ఉన్నది. తిరిగి రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు సూచించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, మంత్రి కేటీఆర్ రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారు.