ఎడిట్ నోట్: ఎలక్షన్ ‘కేబినెట్’.!

-

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుంది..మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి…దీంతో ఈ ఏడాది అంతా ఏపీలో ఎన్నికల సందడి మొదలుకానుంది. రాజకీయ పార్టీలు ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లనున్నారు. ముఖ్యంగా వైసీపీ, టి‌డి‌పిలు గెలుపు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే నెక్స్ట్ కూడా గెలిచి అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. ఇదే క్రమంలో 175 సీట్లని టార్గెట్ గా పెట్టుకున్నారు.

అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి జగన్ గెలవడం సులువు కాదు..ఈ సారి ఎక్కువ కష్టపడాలి. పైగా టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి గెలుపు చాలా కష్టమయ్యే ఛాన్స్ ఉంది. ఆ సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే జగన్ ముందుకెళుతున్నారని తెలుస్తోంది. మళ్ళీ టి‌డి‌పిని నిలువరించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో పలు మార్పు చేసి..వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎన్నికల బరిలో  నిలవాలని చూస్తున్నారు.

ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. అంటే కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే విషయంలో జగన్ ఆలోచన చేస్తున్నారు.  కొందరికి మాత్రం సీటు ఇవ్వరని తేలిపోతుంది. ఇదే సమయంలో ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని జగన్ మంత్రివర్గ విస్తరణ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు.  అయితే ఇటీవల ముగ్గురు, నలుగురు మంత్రుల పనితీరు బాగోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన కొందరు మంత్రులని పక్కన పెట్టి ఫైర్ బ్రాండ్ నేతలని కేబినెట్ లోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. అటు స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం ఉంది. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుని సైతం మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. చూడాలి మరి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news