175కి 175 గెలవాలి…మనం ప్రజలకు అంతా మంచే చేస్తున్నప్పుడు…కుప్పంతో సహ…175 సీట్లు ఎందుకు గెలవలేమని సొంత పార్టీ ఎమ్మెల్యేలని జగన్ అడుగుతున్నారు. తన పని తాను చేసుకుంటూ వెళ్తానని, సమయానికి బటన్ నొక్కుతునాన్నని, ఇంకా మీ పని మీరు చేయాలని ఎమ్మెల్యేలని కోరుతున్నారు. మనం చేసిన మంచి పనులని గడప గడపకు వెళ్ళి ప్రజలకు వివరించి…వారిని మన వైపు ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో క్లియర్ గా వివరించి ప్రజల మద్ధతు పెంచుకోవాలని చెబుతున్నారు..అప్పుడే మనం 175 సీట్లు గెలుచుకుంటామని కూడా అంటున్నారు. అలాగే సరిగ్గా పనిచేయని వారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని, కాబట్టి ఈ ఆరు నెలలు గట్టిగా పనిచేయాలని సూచిస్తున్నారు.
ఇది తాజాగా వైసీపీ వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలకు తీసుకున్న క్లాస్. ఓవరాల్ గా జగన్ చెప్పేది ఏంటంటే…ఎమ్మెల్యేలు మెరుగ్గా పనిచేస్తే..గతంలో వచ్చిన 151 సీట్లు కంటే ఇప్పుడు 175 సీట్లు గెలుచుకోవచ్చని అంటున్నారు. అంటే జగన్ టార్గెట్ 175 సీట్లు…ఆఖరికి కుప్పంలో కూడా గెలిచేస్తామని చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేలని పని తీరు మెరుగుపర్చుకోవడానికి ఇలా క్లాస్ తీసుకోవడంలో తప్పు లేదు…కానీ వాస్తవ పరిస్తితులు చూస్తే వైసీపీ 175 సీట్లు గెలుచుకునేలా ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే విశ్లేషకులు చెబుతున్నారు.
నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే 88 సీట్లు వస్తే చాలు…పోనీ 100 సీట్లు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో మళ్ళీ వైసీపీకి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి గాని…175 సీట్లు గెలవడం అనేది అసాధ్యమైన పని అని చెప్పొచ్చు. అయినా జగనే చెబుతున్నారు…కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో పెద్దగా తిరగడం లేదని, ఇద్దరు ఎమ్మెల్యేలు అసలు గడప గడపకు స్టార్ట్ చేయలేదని, అలాగే 10 మంది ఎమ్మెల్యేలు 5 రోజులే వెళ్లారు..22 మంది ఎమ్మెల్యేలు 10 రోజులే వెళ్లారు.
మొత్తం మీద చూసుకుంటే దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదని తెలిసింది. అలాగే 15 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉంటున్నారు. మరి పరిస్తితి ఇలా ఉన్నప్పుడు 175 ఎలా గెలుస్తారు? అనేది పెద్ద ప్రశ్న. సరే ఎమ్మెల్యేల పరిస్తితి అలా ఉంటే..జగన్ ఏమో తాను సమయానికి బటన్ నొక్కుతున్నానని అంటున్నారు. బటన్ ఒక్కటి నొక్కితే సరిపోతుందా? ఇంకా ప్రజా సమస్యలు పట్టించుకోవడం ఉండదా? అభివృద్ది ఉండదా? కొత్త కంపెనీలు తీసుకురావడం, ఉద్యోగ కల్పన చేయడం, ఆదాయం పెంచడం లాంటివి ఉండవా? అంటే దానికి సమాధానం వైసీపీ వాళ్లే చెప్పాలి.
పైగా ఎమ్మెల్యేల బాధ ఏంటి అంటే…పథకాలు ఎవరికి రావాలో డిసైడ్ చేసేది వాలంటీర్లు, సచివాలయాలు.. బటన్ నోక్కేది సీఎం..మధ్యలో తమకు వచ్చే బెనిఫిట్ ఏంటి? తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. పైగా అభివృద్ధి పనుల కోసం సచివాలయానికి 20 లక్షలు ఇస్తామని అంటున్నారు…సచివాలయం ద్వారా పనులు చేయిస్తే…ఎమ్మెల్యేలు చేయించేది ఏంటి? పథకాల గురించి ప్రజలకు వివరించడమేనా? ఇంకా ఎమ్మెల్యేల పని అలాగే ఉంది.
ఇలా ఎక్కడకక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి..వాటిని సరిచేసుకుంటే వైసీపీకి తిరుగుండేది..జగన్ చెప్పినట్లు ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీకి అనుకూల వాతావరణమే ఉంది. అయితే ఆ అనుకూలతని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు.