ఎక్కడైనా రాజకీయ నాయకులకు ప్రజా ప్రయోజనాలు కంటే…రాజకీయంగా ఎంత మైలేజ్ వచ్చిందనే ముఖ్యమని చెప్పాలి. ఆ మైలేజ్ బట్టే రాజకీయాల్లో విజయాలు అందుకోవడం జరుగుతుంది…అందుకే విజయం సాధించాలంటే ముందు మైలేజ్ పెంచుకోవాలనే దిశగానే ఇటు ఏపీ సీఎం జగన్…అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నరపైనే సమయం ఉంది…కానీ ఏపీలో రాజకీయాలు చూస్తుంటే..ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగిపోతున్నాయా? అనే పరిస్తితి. అంటే ఆ స్థాయిలో వైసీపీ-టీడీపీలు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
ఇక ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుని బలపడటంపైనే ఇద్దరు నేతల ఫోకస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గోదావరి వరదలని సైతం రాకీయ మైలేజ్ పెంచుకోవడానికి చూసినట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు జగన్ గాని, ఇటు చంద్రబాబు గాని…ప్రజలకు అండగా ఉండాలని అనుకోవచ్చు…వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకోవాలని భావించవచ్చు. ఎంత ఉన్నా సరే ఎంతో కొంత పోలిటికల్ మైలేజ్ పెంచుకోవడం కోసం మాత్రం పనిచేస్తున్నారనే చెప్పొచ్చు.
మొదట జగన్…ఏరియల్ సర్వే ద్వారా గోదావరి వరదలపై సమీక్ష చేశారు..అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, వాలంటీర్ల ద్వారా పేదలకు సహాయ కార్యక్రమాలు అందించారు. అయితే ప్రభుత్వం చేసిన వరద సాయం…ప్రజలకు పెద్ద ఉపశమనం ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇదే క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు…డైరక్ట్ ఫీల్డ్ లోకి దిగారు…బాధితులని పరామర్శించారు. బాధితులకు సాయం పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..అలాగే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు…ఇక ఇందులో టీడీపీ అనుకూల మీడియా బాబుని హైలైట్ చేస్తూ…జగన్ ని నెగిటివ్ చేసే కార్యక్రమం చేసింది.
అంటే ఇక్కడ చంద్రబాబు..బాధితులని పరామర్శిస్తూనే..పోలిటికల్ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. ఇక బాబు బురదలో తిరిగితే తాను తిరగకపోతే బాగోదు అనుకున్నారో లేక…అంతా సర్దుకున్నాక వెళితే ప్రజలకు అందించే సహాయ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకున్నారో తెలియదు గాని…బాబు పర్యటన అయ్యాక జగన్ గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలని పరామర్శించారు. ఎక్కడకక్కడ బాధితులని ఆప్యాయంగా పలకరిస్తూ…వారికి అండగా ఉంటానని జగన్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే జగన్ పర్యటనలో కొందరు ప్రజల నుంచి నిరసనలు కూడా వచ్చాయి…కానీ వాటిని ఎక్కువ హైలైట్ కాకుండా వైసీపీ అనుకూల మీడియా బాగానే కవర్ చేసింది.
అదే సమయంలో జగన్ ఎక్కడకు వెళ్ళిన దుష్టచతుష్టయం అనే పేరు వదలడం లేదు..చంద్రబాబు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 అంటూ ఫైర్ అవుతూ వచ్చారు. బురదలో తిరుగుతూ కూడా జగన్..బాబుని వదిలిపెట్టలేదు. ఇక ఇక్కడ జగన్ కూడా పోలిటికల్ మైలేజ్ పై ఫోకస్ చేశారని చెప్పొచ్చు. మొత్తానికైతే జగన్-బాబు…ఇద్దరు నేతలు బురదలో కూడా మైలేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేశారు…మరి ఇందులో ఎవరికి మైలేజ్ పెరిగిందో..ఇప్పుడే చెప్పలేం…ఎవరి మైలేజ్ ఏంటో ఎన్నికల సమయంలోనే తెలుస్తోంది.