ఎడిట్ నోట్: పొత్తు రెడీ..కానీ.!

-

టీడీపీ-బీజేపీలతో పొత్తుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీ..అందులో ఎలాంటి డౌట్ లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని వైసీపీని గద్దె దించాలని పవన్ భావిస్తున్నారు. అలాగే తనకు సీఎం సీటు కాదు ముఖ్యం…జగన్‌ని ఓడించడం ముఖ్యమని అంటున్నారు. బలం ఉండి సీఎం సీటు అడిగితే తప్పు లేదని, బలం లేకుండా అడగడం కరెక్ట్ కాదని అంటున్నారు. గత ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు కూడా గెలిపించలేదని, కాబట్టి సీఎం సీటు డిమాండ్ చేయలేమని పవన్ చెబుతున్నారు.

సరే సీఎం సీటు పక్కన పెడితే..టి‌డి‌పి-బి‌జే‌పితో పొత్తుకు తాను రెడీ అని చెప్పి..బంతి టి‌డి‌పి, బి‌జే‌పి కోర్టులో పెట్టారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఆ రెండు పార్టీలే. అందులో టి‌డి‌పికి ఎలాంటి ఇబ్బంది లేదు. జనసేన-బి‌జే‌పితో కలవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. జనసేన వల్ల కొన్ని స్థానాల్లో ఓట్లు కలిసొస్తాయని, ఇక బలం లేకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల బి‌జే‌పితో ప్లస్ అవుతుందని బాబు భావిస్తున్నారు.

కాకపోతే టి‌డి‌పి శ్రేణులు మాత్రం బలం లేని బి‌జే‌పితో పొత్తు వద్దనే చెబుతున్నారు. పైగా రాష్ట్రానికి బి‌జే‌పి ఏమి చేయలేదనే ఆగ్రహం ప్రజల్లో ఉందని, అలాంటప్పుడు వారితో పొత్తు పెట్టుకుంటే ఆ ప్రభావం టి‌డి‌పిపై కూడా పడుతుందని అంటున్నారు. సరే బాబు ఏ నిర్ణయం  తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. కానీ ఇప్పుడు తేల్చాల్సింది బి‌జే‌పి మాత్రమే.. ఆ పార్టీ వాళ్ళు ఇప్పటికే టి‌డి‌పితో పొత్తు ప్రసక్తే లేదనే అంటున్నారు.

పలుమార్లు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నామని, ఈ సారి కూడా నష్టపోలేమని అంటున్నారు. టి‌డి‌పితో పోత్తు ఉంటే సొంతంగా బలపడలేమని అంటున్నారు. మరి పోత్తు విషయంలో కేంద్రం పెద్దలు తీసుకునే నిర్ణయమే ఫైనల్..మరి పొత్తుపై బి‌జే‌పి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి..చివరికి టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పోత్తు ఉంటుందా? లేక టి‌డి‌పి-జనసేన పోత్తు ఉంటుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news