గుడ్డు తినండి..ఆరోగ్యంగా ఉండండి అని వైద్యులు చెబుతుంటారు. గుడ్డు అంటే ఇష్టంలేని వాళ్లు కూడా ఈ మహమ్మారి దెబ్బకు కనీసం రోజుకు ఒక గుడ్డైనా తింటున్నారు. అయితే చాలామందికి గుడ్డు తినటంలో కూడా మస్త్ షేడ్స్ ఉంటాయిలే..కొందరు ఉడికించిన గుడ్డులో వైట్ ది తిని..పచ్చది వదిలేస్తారు. కొంతమంది..లోపలి పార్ట్ తిని బయటది వదిలేస్తారు. అసలు గుడ్డు ఎందుకు తింటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి..అలాంటప్పుడు మొత్తం తినాలి కదా..మళ్లీ అందోలో ఈ డిఫ్రన్స్ ఏంటో.
శరిరంలో కొవ్వు పెర్కొని గుండెపోటు కూడా వస్తుందని భావిస్తారు. ఇంకా కొందరైతే గ్యాస్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది ఫీల్ అవుతారు.
అయితే నిజానికి.. కొలెస్ట్రాలు కూడా ఉంటుంది . పచ్చసొనలో కొలెస్ట్రాలు 185 గ్రాములు వరకు ఉంటుంది . అందువలనే ఈ పసుపు సొన భాగంలో కొలెస్ట్రాలు అధికంగా ఉండటం వలన దీనిని తినడానికి ఇష్టపడరు.
పచ్చసొనలో అధికంగా క్యాలరీలు ఉంటాయి. పచ్చసొనలో.. 55 క్యాలరీలు ఉండగా.. తెల్ల సొనలో 17 క్యాలరీలు ఉంటాయి . క్యాలరీలు అధికంగా ఉన్న పచ్చ సొన తినడం వలన శరీరంలో ఫ్యాట్ పెరుకు పోతుందని దీనిని తినడం మానేస్తారు. కొలెస్ట్రాలు గురించి మాట్లాడితే ..నిజానికి పచ్చ సొనలో ఉండే కొలెస్ట్రాల్ హనికరం కాదు. గుడ్డులోని పచ్చసొనలో చాలా పోషకాలు ఉంటాయి. అంతే కాదు ఇది మన ఆరోగ్యానికి చాలా అవసరం.