వెస్ట్ ఇండీస్ సిరీస్ కు ఆ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కు మొండి చెయ్యి …!

-

ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. కనీసం సెమీస్ కు కూడా చేరకుండానే వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఇంగ్లాండ్ దారుణంగా విఫలమై విమర్శలను మూటగట్టుకుంది. ఇక వరల్డ్ కప్ అనంతరం ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ లో మూడు వన్ డే లు మరియు 5 టీ 20 లు ఆడనున్న ఈ సిరీస్ లో వరల్డ్ కప్ లో భాగం అయిన కొందరి ప్లేయర్స్ కు ఇంగ్లాండ్ క్రికెట్ యాజమాన్యం మొండి చెయ్యి చూపింది. ఈ వరల్డ్ కప్ ఆడిన వారిలో డేవిడ్ మలన్, జో రూట్, స్టోక్స్, బెయిర్ స్టో, మార్క్ వుడ్ , డేవిడ్ విల్లీ లు ఈ సిరీస్ లో ఆడడం లేదు. మరి వీరిది యాజమాన్యం రెస్ట్ ఇచ్చిందా లేదా తొలగించిందా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

ఇక వీరు కాకుండా.. ఈ టీం లో యంగ్ ప్లేయర్స్ కొందరు చోటు దక్కించుకున్నారు. ఈ వరల్డ్ కప్ లో జరిగిన చేదు అనుభవాన్ని వెంటనే మరిచిపోయి మళ్ళీ ఛాంపియన్ లాగా వరుస విజయాలను సాధిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version