టీమిండియా-ఇంగ్లండ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మిగిలి ఉన్న మూడో మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా చూస్తోంది. అయితే.. నాటింగ్ హామ్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో లక్ష్యఛేదన చేయలేక చతికిలబడిన ఇంగ్లండ్… ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యం నిర్దేశించాలని యోచిస్తోంది.
కాగా, ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ కోసం జట్టులో నాలుగు మార్పులు చేసింది. రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చారని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చహల్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి కల్పించినట్టు వెల్లడించాడు. అటు, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. పార్కిన్సన్, శామ్ కరన్ లకు తుదిజట్టులో స్థానం లభించలేదు. రీస్ టాప్లే, ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చారు.