ఈపీఎఫ్ వడ్డీ పడలేదా..? కారణం ఇదేనట….!

-

2021 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటును డిసెంబర్ 2021లో క్రెడిట్ చేశారు. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు మార్చి నెలలోనే పీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. ఈ వడ్డీ రేటు 43 ఏళ్ల కనిష్ట స్థాయి. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఈ కనిష్ట స్థాయిలలో వడ్డీలను ఇవ్వడం జరిగింది. అప్పుడు వడ్డీ రేటు 8 శాతం.

2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని, 2019-19లో 8.65 శాతం వడ్డీని, 2017-18లో 8.55 శాతం వడ్డీని ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా నెలవారీగా లెక్కించి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఈపీఎఫ్ వడ్డీని లెక్కిస్తారు. 2021-22 వడ్డీ జమ అవ్వాల్సి వుంది. అయితే ఇంకా ఇవి ఎందుకు అకౌంట్ లో పడలేదు అని అంతా అడుగుతున్నారు.

అకౌంట్లలో వడ్డీ జమ అవుతోందని… ఒకవేళ కనుక స్టేట్‌మెంట్‌లో కనిపించకపోతే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ దానికి కారణం అని చెప్పారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నందున ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ కనిపించట్లేదని తెలిపింది. అయితే సెటిల్‌మెంట్ కోరుకునే అవుట్‌గోయింగ్ సబ్‌స్క్రైబర్‌లందరికీ, విత్‌డ్రాయల్ చేస్తున్నవారికి వడ్డీతో పాటుగా పేమెంట్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే వడ్డీ జమ కావడంలో వచ్చిన సమస్య సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ అని అన్నారు కానీ ఇప్పటికే చాలా మందికి పడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version