టీడీపీ, ఇంకొక పార్టీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పార్టీ కాదు బీజేపీ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన లింగలఘనపూర్ లో మాన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్… దేశ ప్రజానీకానికి అన్ని విషయాలు తెలిసేలా ఎడ్యుకేట్ చేయడంలో మాన్ కి బాత్ ఉపయోగకరం అన్నారు. వ్యవసాయం బాగుపడకుండా దేశం బాగుపడదన్నారు. ఒకప్పుడు వ్యవసాయంలో పురుగు మందులు లేకుండా ఆర్గానిక్ గా పంటలు పండించేవారన్నారు. చాలా గొప్పగా ఉండేదని, ఇప్పుడు మొత్తం కెమికల్స్ ఆధారంగా పంటలు పండిస్తున్నారని తెసిపారు. వ్యవస్థను మార్చాలంటే విప్లవాత్మక మార్పు రావాలని సూచించారు. రాష్ట్రాల అభివృద్ధి దేశంతో ముడిపడి ఉందన్నారు. మాన్ కీ బాత్ తెలంగాణలోని లింగలఘనపూర్ లో జరగడం సంతోషకరం అన్నారు. మనిషి శ్రమని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అదే అనారోగ్యానికి దారితీస్తుందన్నారు.
ఒకప్పుడు వ్యవసాయం కెమికల్స్ రహితంగా ఉండేది. ఇప్పుడు కెమికల్స్ మయం అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే శ్రమజీవులకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కెమికల్స్ వాడకం ఎక్కువయ్యాక రోగాలు పెరిగిపోయాయి. అందుకు వ్యవసాయంలో పాత పద్దతులు పాటించేలా చేయాలి. మనిషి శ్రమ మర్చిపోతున్నాడు. శ్రమ లేకపోవడం వల్ల అనారోగ్యం పెరిగిపోతుంది. ప్రాచీన సంప్రదాయాలను ఆచరించాలని ప్రధాని మోదీ సూచిస్తున్నారు. అని ఈటల వ్యాఖ్యానించారు.