యురోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ కు సభ్యత్వం… దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే దరఖాస్తుకు ఆమోదం

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యంత బలమైన యూరోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ కు సభ్యత్వం లభించేందుకు మార్గం సుగమమైంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఉక్రెయిన్ దరఖాస్తుకు ఈయూ పార్లమెంట్ ఆమోదం లభించింది. స్పెషల్ అడ్మిషన్ కేటగిరీలో ఉక్రెయిన్ కు సభ్యత్వం వచ్చింది. ప్రస్తుతం ఈయూలో మొత్తం 27 సభ్య దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ చేరితే ఈ సంఖ్య 28కి చేరనుంది.

దరఖాస్తును ప్రాసెస్ చేసి.. ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వనుంది. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కావాలని బలంగా కోరుతున్నారు. ఈ విషయంపై నిన్న ఈయూ దరఖాస్తుపై జెలెన్ స్కీ సంతకం చేశారు. మరోవైపు రష్యాను ఎదర్కొనేందుకు ఈయూ కలిసి రావాలిని.. సహాయం చేయాలని జెలన్ స్కీ కోరుతున్నారు. ఇప్పటికే పలు యూరోపియన్ దేశాల నుంచి ఆయుధ, సైనిక సహాయం లభిస్తోంది. మిస్సైళ్లు, యుద్ధ విమానాలనున అందించారు. రష్యా దేశాలను ఎదుర్కొనేందుకు ఈయూ దేశాలు తెరవెనక నుంచి ఉక్రెయిన్ కు సహకారం లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version