కాలుష్యం మానవ జాతికి మనుగడకు సవాలుగా మారిందని, కాలుష్యంతో ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హై టెక్స్ లో ఈవీ ట్రెడ్ ఎక్స్పోలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకే భవిష్యత్తు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మధ్యనే ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కొన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాహనాలకు గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలే ప్రత్యామ్నాయాలు అని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వ టాక్స్ రాయితీ ఇస్తుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు రాష్ట్రం ప్రోత్సాహాకాలు ఇస్తుందని మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్న సమయంలో రాష్ట్రంలో 130 ఛార్జింగ్ స్టేషన్లకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించాడు. జాతీయ రహదారులపై ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతీ 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.